Actress Namitha: తెలుగు చిత్ర పరిశ్రమకు సొంతం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి నమిత.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా తెలుగు తమిళ మలయాళ భాషలలో నటిగా కొనసాగిన నమిత అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్రనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అనంతరం ఈమె సినిమాలకు దూరమయ్యారు అయితే తాజాగా నమిత పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన పిల్లల గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ అభిమానులను సందడి చేసే నమిత మొదటి సారి తన భర్త పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితుల ఆశీర్వాదం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల సందడి చేసిన నమిత మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈమె మీడియాతో మాట్లాడుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తనకు సినిమాలపై కన్నా రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి కలుగుతోందని సరైన సమయం చూసుకొని రాజకీయాలలోకి అడుగు పెడతానంటూ ఈ సందర్భంగా ఈమె రాజకీయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే నమిత రాజకీయాలలోకి వస్తే ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు ఏ పార్టీ తరఫున రాజకీయాలలో కొనసాగుతారనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…