Temper Movie: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం టెంపర్. ఈ సినిమా కథకు ఎన్టీఆర్ నటన అన్ని ఎంతో అద్భుతంగా ఉండి ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ విధంగా ఎన్టీఆర్ పూరి కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వక్కంతం వంశీ కథ సిద్ధం చేసిన తర్వాత మొదటిసారి టెంపర్ సినిమా కథను తనకు వినిపించారని ఈ సినిమాకి పవర్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించామని మెహర్ రమేష్ వెల్లడించారు.ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా అయితే అద్భుతంగా ఉంటుందని భావించాము. అయితే సినిమా కథను రవితేజకు వినిపించగా రవితేజకు కథ నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారు.
ఇకపోతే ఈ సినిమా వక్కంతం వంశీ ఎన్టీఆర్ కు వినిపించారు.ఈ స్క్రిప్ట్ విన్న ఎన్టీఆర్ పూరి టేకింగ్ అయితే అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ను దర్శకుడిగా తీసుకున్నారు.ఇక ఈ సినిమాకు టెంపర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని మెహర్ రమేష్ వెల్లడించారు.
ఈ విధంగా రవితేజ నేను ఇద్దరం కలిసి చేయాల్సిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ తీశారని, రవితేజ కనుక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మా ఇద్దరి కాంబినేషన్లో మంచి హిట్ సినిమా పడేది అంటూ ఈ సందర్భంగా మెహర్ రమేష్ టెంపర్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…