Rashmi Gautam: బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ బుల్లితెరకు యాంకర్ గా పరిచయం కాకముందు ఈమె వెండితెరపై పలు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే యువ హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఈమె నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో ఈమె ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించి సందడి చేశారు. ఈ విధంగా వెండితెరపై పలు సినిమాలలో నటించిన రష్మికి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
వెండితెరపై అందాలను ఆరబోస్తూ బోల్డ్ సన్నివేశాలలో నటించినప్పటికీ ఈమెకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో వెండితెరకు దూరమై బుల్లితెర కార్యక్రమాలతో బిజీ అయ్యారు.ఇకపోతే గత రెండు సంవత్సరాల క్రితమే సింగర్ గీతామాధురి భర్త నటుడు నందుతో కలిసి ఈమె బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమాలో నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాని నవంబర్ 4వ తేదీ విడుదల చేయడం కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ ట్రైలర్ చూస్తే కనుక రష్మీ నటుడు నందుతో కలిసి ఎన్నో బోల్డ్ సన్ని వేశాలలో నటించినట్టు అర్థమవుతుంది. గుంటూరు టాకీస్ సినిమాతో తనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ చూపించిన రష్మీ మరోసారి నందుతో కలిసి భారీగా రొమాన్స్ చేసినట్టు అర్థం అవుతుంది.
పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్లలో రష్మీ రెచ్చిపోయిన నటించిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ సినిమా అయిన రష్మికి కలిసొస్తుందా లేకపోతే ఈ సినిమా కూడా తనకు నిరాశనే మిగులుస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…