Actress Namitha: సొంతం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై నమిత, జెమిని, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఒక రాజు ఒక రాణి, బిల్లా, సింహ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. అయితే గత కొంత కాలం నుంచి నమిత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన నమిత వైవాహిక జీవితంలో స్థిరపడి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2017 వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ఈమె తిరుపతిలో ఎంతో ఘనంగా వివాహమాడారు. వివాహమైన తర్వాత నమిత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
ఇకపోతే మే 10వ తేదీ నమిత పుట్టినరోజు సందర్భంగా ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి నమిత నిత్యం తన ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో అనుభూతులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు.
తాజాగా నమిత సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా సీమంతం వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన సీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలోనే నమిత ఓ పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…