Movie News

Bindu Madhavi: రెండింతలు రెమ్యునరేషన్ పెంచేసిన బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవి.. ఎంత పెంచారో తెలుసా?

Bindu Madhavi: బిందుమాధవి వెండితెర నటిగా బిగ్ బాస్ విన్నర్ గా అందరికీ సుపరిచితమే. అష్టాచమ్మా ఆవకాయ బిర్యాని వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన బిందు మాధవి గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు. తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అవకాశాలు కోసం ఎదురు చూశారు. అయితే అక్కడ కూడా అడపాదడపా సినిమాల్లో నటించిన ఈమె బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.

తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో విజయం సాధించనీ బిందుమాధవి తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమానికి విజేతగా నిలిచి మొదటిసారిగా మహిళ విజేతగా చరిత్ర సృష్టించారు.ఇకపోతే ఈమె బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో తనకు పెద్ద ఎత్తున అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె సుమారు 40 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి విజేతగా నిలిచిన బిందుమాధవికి బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాతో పాటు మరికొన్ని సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.అయితే ఈమె ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

సానుకూలంగా నిర్మాతలు…


ఇదివరకు బిందుమాధవి ఒక్కో సినిమాకు 25 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇక ఈమె బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఒక్క సినిమాకు ఏకంగా యాభై లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో సినిమాకు రెండింతలు రెమ్యునరేషన్ పెంచి అందరికీ షాక్ ఇచ్చారు.అయితే బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago