Shot Body Spray: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్క కంపెనీ తమ ఉత్పత్తులను ప్రచారం చేయడం కోసం వివిధ రకాల యాడ్స్ షూట్ చేసి తమ ప్రొడక్ట్స్ అందరినీ ఆకట్టుకునేలా రూపొందిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి యాడ్ షూట్స్ పలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి యాడ్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది.
ఇకపోతే తాజాగా మరొక యాడ్ కూడా ఇలాంటి వివాదానికి దారి తీసింది. ప్రముఖ బాడీ స్ప్రే షాట్ అనే కొత్త పర్ఫ్యూమ్ ను మార్కెట్ లోకి తెచ్చింది. దీనికోసం ప్రముఖ కంపెనీ రెండు యాడ్స్ ను రూపొందించారు. అయితే ఈ రెండు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఈ యాడ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు యాడ్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండటం వల్ల యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పలువురు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాపింగ్ మాల్ లో నలుగురు కుర్రాళ్లు నిలబడి మేము నలుగురం కానీ అక్కడ ఒకటే ఉంది అంటూ షాట్ పర్ ఫ్యూమ్ బాటిల్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతారు.అయితే అక్కడ ఒక అమ్మాయి ఉండడంతో తన గురించి మాట్లాడుతున్నారని కోపం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ నలుగురు మాట్లాడేది షాట్ పర్ఫ్యూమ్ కోసం అని తెలియడంతో ఆ అమ్మాయి ఊపిరిపీల్చుకుంది. అదేవిధంగా ఒక గదిలో ఒక జంట ఉండగా నలుగురు అబ్బాయిలు వెళ్లి వారు మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా అమ్మాయినీ భయాందోళనకు గురి చేశాయి. అయితే వారు మాట్లాడింది షాట్ స్ప్రే గురించి అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంది.
ఈ విధంగా ప్రస్తుత కాలంలో ప్రతి రోజు ఎంతో మంది యువతులు అత్యాచార సంఘటనలను తలుచుకొని భయపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే షాట్ యాడ్ వీడియోలు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఎంతోమంది ఈ యాడ్ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్స్‌ను ప్రసారం చేసింది. అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI).. సోషల్ మీడియాలో ఈ వీడియోలో పై తీవ్ర దుమారం చెలరేగడమే కాకుండా ఈ యాడ్ తొలగించి వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…