దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నయనతార ప్రేమ విషయం పెద్దఎత్తున వైరల్ గా మారింది.గతంలో ఈమె ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్నదని వార్తలు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు.
ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి దిగిన ఎన్నో రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే వీరి పెళ్లి గురించి మాత్రం క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం తను విగ్నేష్ తో నిశ్చితార్థం చేసుకున్నానని త్వరలోనే కేరళలో ఒక ప్రముఖ చర్చిలో వివాహం జరుగుతుందని తెలియజేశారు. అయితే వీరి వివాహం ఎప్పుడు ఏంటి అనే విషయం తెలియలేదు. ఎన్నోసార్లు వీరి వివాహం వాయిదాపడుతూ వస్తుందని అందుకు గల కారణం నయనతార పుట్టుకతోనే దోషం ఉండటం చేత దోషపరిహారం చేయాలని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ముందుగా నయనతార ఒక చెట్టును వివాహం చేసుకొని దోషపరిహారం అనంతరం తాను విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే నయనతార ఈ చెట్టు వివాహ కార్యక్రమం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.గతంలో కూడా నయనతార మాదిరిగానే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతులు కూడా ముందుగా ఒక చెట్టుకు వివాహం చేసిన తరువాతనే వీరి వివాహం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…