Categories: FeaturedGeneral News

నా భార్యను పెళ్లి చేసుకోండి.. మ్యాట్రిమోనీలో ప్రకటన చేసిన భర్త..!

సాధారణం గా పెళ్లి కానీ అమ్మాయిల ప్రకటనలను వారికి సంబంధించిన బయోడేటాను సంబంధిత కులానికి చెందిన మ్యాట్రిమోనీలో ప్రకటిస్తూ వివాహ సంబంధాలను వెతకడం మనం చూస్తుంటాము. అయితే మీరెప్పుడైనా మ్యాట్రిమోనీలో భర్త ఉండగానే భార్యకు వివాహ ప్రకటన చేయడం విన్నారా.. ఆ ప్రకటన కూడా భర్త చేయడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన ఓ యువతి ఓంకుమార్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. 2016 సంవత్సరంలో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఇన్ని రోజులు ఎంతో ఆనందంగా సాగిన వీరి సంసారంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

ఇలా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో ఆ గొడవలను సర్దిచెప్పే ప్రయత్నం కుటుంబ సభ్యులు చేసినప్పటికీ వినకపోవడంతో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం వీరి విడాకులు కోర్టులో పరిశీలనలో ఉండగానే ఓంకార్ తన నీచ బుద్ధిని బయటపెట్టారు.

తన భార్యకు సంబంధించిన బయోడేటాను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి వరుడు కావలెను అంటూ తన తండ్రి ఫోన్ నెంబర్ పెట్టారు.ఈ క్రమంలోనే ఆ యువతి డీటెయిల్స్ చూసిన కొందరు వ్యక్తులు తమ కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ తన తండ్రికి ఫోన్లు చేస్తున్నారు. ఇలా తన కూతురు గురించి తనని పెళ్లి చేసుకుంటామని ఫోన్ కాల్స్ రావడంతో ఎంతో ఆశ్చర్యానికి గురైన తన కుటుంబ సభ్యులు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అసలు నిజం బయట పెట్టడంతో పాటు ఓంకార్ ను అదుపులోకి తీసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago