Categories: FeaturedMovie News

నటి పాయల్ ఘోష్ పై యాసిడ్ దాడికి ప్రయత్నించిన దుండగులు..!

సంచలన నటి పాయల్ ఘోష్ పై ముంబైలో యాసిడ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. మెడిసిన్ కోసం మెడికల్ స్టోర్ కి వెళ్ళిన ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తనపై యాసిడ్ దాడి చేయటానికి ప్రయత్నించారని నటి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే గాయపడిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఈ విషయాన్ని బయటపెట్టారు.

గతంలో దర్శకుడు నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా పాపులారిటీ అయిన ఈ బ్యూటీ తాజాగా దుండగుల చేతిలో గాయపడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.తను తన కారు డ్రైవర్ బైలోని ఒక మెడికల్ స్టోర్ కి వెళ్లి మందులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తుల ముసుగులో వచ్చి తనపై దాడి చేశారని తెలియజేసింది.

ఆ సమయంలో గట్టిగా అరవడం వల్ల దుండగులు తనని రాడ్ తో కొట్టి పారిపోయారని.. వారి చేతిలో ఒక సీసా ఉందని అది ఏంటి అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఒక వేళ అది యాసిడ్ కూడా అయి ఉండొచ్చని పాయల్ తెలియజేసింది. తన జీవితంలో ఎప్పుడూ ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోలేదని ఇదే మొదటిసారి అని పాయల్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే తనపై జరిగిన దాడిని పోలీసులకు తెలియజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బయలుదేరుతున్నాను అంటూ తన చేతికి గాయమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదిఏమైనప్పటికీ సినీనటి పై ఈ విధంగా దాడి జరగడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago