Actress Poorna: పెళ్లి ముహూర్తం పరారు చేసుకున్న నటి పూర్ణ.. పెళ్లి తర్వాత వాటికి దూరం?
Actress Poorna: సీమటపాకాయ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి పూర్ణ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ఈమె తెలుగులో కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన పూర్ణ ఈ కార్యక్రమంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈమె ఈ కార్యక్రమానికి దూరమై శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర వెండితెరపై సందడి చేస్తూ విశేషమైన అభిమానులను సంపాదించుకున్న పూర్ణ తన వివాహ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ క్రమంలోనే ఈమె కనుక కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని వెల్లడించారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ తన పెళ్లి గురించి పరోక్షంగా వెల్లడించారు.అందరూ తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని భావిస్తున్నారు నిజానికి తన పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిపారు.
ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న పూర్ణ నవంబర్ ఆరవ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇక వివాహం తర్వాత ఈమె తన భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళనున్నారు. ఈ క్రమంలోనే ఇటు బుల్లితెర కార్యక్రమాలకు అలాగే వెండితెర సినిమాలకు కూడా పూర్ణ దూరం కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి పూర్ణ అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.
మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న వేళ, ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్‌కి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పానీయాలపై మళ్లీ దృష్టి పడుతోంది.…
వేసవి తాపానికి సహజ చల్లదనం అందించే మట్టి కుండలు… ఆరోగ్యానికి మేలు చేసే ఈ సంప్రదాయ విధానంలో జాగ్రత్తలు తప్పనిసరి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత వైఎస్ జగన్…
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో నిర్వహించిన ఎన్పీ సావిత్రమ్మ…
యంగ్ హీరో అడవి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’ విడుదలకు ముందే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…