Actress Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీమటపాకాయ్ శ్రీ మహాలక్ష్మీ వంటి ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ఇక గత యేడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని వివాహం చేసుకున్న పూర్ణ వివాహం జరిగిన కొంతకాలానికి గర్భం దాల్చినట్లు శుభవార్త తెలియజేసింది. ఇక ఏప్రిల్ నాలుగవ తేదీన పండంటి మగ బిడ్డకు పూర్ణ జన్మనిచ్చింది. ఇక తాజాగా పూర్ణ కొడుకు బారసాల వేడుకలు ఘనంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా పూర్ణ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల జరిగిన బారసాల వేడుకలలో పూర్ణ తన భర్త కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. పూర్ణ కొడుకుకి హందాన్ అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఈ బారసాల వేడుకలకు సంబంధించిన ఫోటోలను పూర్ణ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో చూసిన నెటిజన్లు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాబుకి తమ బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. బాబు అచ్చం పూర్ణ లాగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొడుకు పుట్టిన తర్వాత పూర్ణ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. వివాహం జరిగిన తర్వాత కూడా సినిమాలలో నటించిన పూర్ణ మళ్లీ సినిమాలలో ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయం తెలియాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…