బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీఈ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ షోలో న్యాయనిర్ణేతలుగా పూర్ణ, ప్రియమణి వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి జడ్జిమెంట్ పలు వివాదాలకు కారణమవుతోంది. సాధారణంగా కంటెస్టెంట్ లకు జడ్జిలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.వారు డాన్స్ బాగా చేస్తే వారు ఫర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం జడ్జిగా వ్యవహరిస్తున్న వారి పని. కానీ డీ షోలో మాత్రం కంటెస్టెంట్ లకు హగ్గులు,ముద్దులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.
అదేవిధంగా యాంకర్ ప్రదీప్, ఆదితో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గతంలో ఢీ అంటే కేవలం రష్మి, సుధీర్ మధ్య మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఉండేవి. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సన్నివేశాలను పూర్ణ ప్రియమణి ఇద్దరు యాంకర్ తో కూడా రొమాన్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ ఏకంగా తన బుగ్గపై కొరకడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో వస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన” మాటేరాని చిన్నదాని.. కళ్ళు పలికే ఊసులు”.. అనే సూపర్ హిట్ పాటకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేశారు.
ఈ విధంగా డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ తన సీట్ నుంచి వెళ్లి ఏకంగా ఆ డాన్సర్ బుగ్గపై గట్టిగా కొరకడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వీరి వ్యవహారం హగ్గుల నుంచి కిస్ లు వరకు వెళ్లి ప్రస్తుతం బుగ్గ కొరకడం వరకు వెళ్ళారంట తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…