కృష్ణ బిలాల వెనుక కాంతి ప్రతి ధ్వనులు ఉన్నాయని ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. తాజాగా శాస్త్రవేత్తలు కృష్ణ బిలాల వెనుక ఉండే కాంతి ప్రతి ధ్వనులు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆయన మేధస్సుకు ప్రతీ ఒక్కరూ సలాం కొడుతున్నారు. విశ్వంలో ఉండే ప్రతీ వస్తువును కృష్ణ బిలాలు తమ వైపు లాక్కుంటాయి.
అయితే కృష్ణ బిలాల వెనుక ఉండే రహస్యాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రహస్యాలను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. దాదాపు ఇవి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. కాంతికి సంబంధించిన ధర్మాల్లో కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే దీనిని టెలిస్కోప్ ద్వరా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎనాడో గుర్తించారు. ఐన్‌స్టీన్ ఓ సిద్ధాంతంలో ఇలా చెప్పారు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ఆనాడే తెలిపారు. ఆ సమయంలో ఐనస్టీన్ చెప్పిన దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు.
ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించడంతో ఐన్ స్టీన్ గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను భయట పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…