దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. దీనిలో దాదాపు చాలామందికి ఖాతా ఉండి ఉంటుంది. అయితే ఎవరైనా సేవింగ్ లేదా కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తూ ఉంటారు. అందులో మనం డిపాజిట్ చేసే అమౌంట్ కు ఎస్ బీఐ చాలా తక్కువగా వడ్డీని ఇస్తుంటుంది. అయితే చాలామందికి తెలియని మరొక అకౌంట్ ఎస్ బీఐ లో ఉంది. అదే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్. ఈ అకౌంట్ ను ఓపెన్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఎక్కువ వడ్డీని ఇస్తుంటారు.
సాధారణ అకౌంట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు అధికమనే చెప్పాలి. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో ఖాతాదారులు దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ వినియోగదారులు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది. ఖాతాలఓ మనకు ఇప్పుడు అవసరం లేని డబ్బులు ఉంటే వాటికి ఎస్ బీఐ అధికంగా వడ్డీ చెల్లిస్తుంటుంది. మన అకౌంట్ లోని కొంత డబ్బులను ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఖాతాలో ఉన్నన్ని రోజులు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ పొందవచ్చు. ఉదాహరణకు మన అకౌంట్లో రూ. 45 వేలు ఉంటే కనీసం రూ. 10 వేల మల్టీ పర్పస్ ఆప్షన్ డిపాటిట్ స్కీమ్ లో జమ అవుతాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అయిన మొత్తానికి ఎక్కవ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ మన అకౌంట్లో రూ. 50 వేలు ఉంటే అందులో నుంచి రూ. 15 వేలు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతుంది. ఈ రూ. 15 వేలకు అధిక వడ్డీని ఎస్ బీఐ ఇస్తుంది.
అంటే ఒక ఖాతాలో రూ. 30 వేల కంటే అధికంగా ఎంత ఉంటే అంత అమౌంట్ ను మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ చేసి అధిక వడ్డీని పొందొచ్చు. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ ఖాతాలో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి. అంతే కాకుండా చెక్ బుక్స్ నుకూడా ఉచితంగా పొందచ్చు. ఈ స్కీమ్ లో లోన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఖాతాలో ఎంత అమౌంట్ అయినా మెయింటెన్ చేసుకునే వీలుంటుంది. పూర్తి వివరాలకు https://bank.sbi/ ను సందర్శించి అందులో పేర్కొన్న టర్మ్స్ అండ్ కండీషన్స్ ను చదివితే అర్థం అవుతుంది.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…