టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య”ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ లో ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన ఎవరు జోడి కట్టబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం తెర పైకి మాత్రం కియారా అద్వానీ పేరు వినబడుతోంది.
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా ఆడిపాడుతున్నారనే వార్త వినబడుతోంది.ఇది వరకే వీరిద్దరి కాంబోలో “వినయ విధేయ రామ”తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. తిరిగి ఈ భారీ ప్రాజెక్టులో ఈ జోడి మరోసారి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్,క్యాస్టింగ్ ఫైనలైజేషన్ లో ఉంది. చరణ్ తన రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…