Actress pratyusha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె 2002లో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె పై అత్యాచారం చేసిన కారణంగానే మరణించిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యూష మరణం తర్వాత ఆమె తల్లి సరోజినీ దేవి తన కూతురికి న్యాయం జరగాలంటూ ఎంతో మందిని ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే తన కూతురుకు న్యాయం జరగాలని ఎంతో మంది పొలిటీషియన్లను ఈమె సంప్రదించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2002లో తన కూతురు చనిపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసానని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, కెసిఆర్ గారిని కూడా తాను కలిసానని ప్రత్యూష తల్లి వెల్లడించారు.
ఇలా తనకు న్యాయం జరగాలని ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసినప్పటికీ తనకు మాత్రం కెసిఆర్ గారి సహాయం చేశారని ఈ సందర్భంగా సరోజినీ దేవి పేర్కొన్నారు.అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతోంది కేసీఆర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ పలు జిల్లాలలో పర్యటిస్తున్నారని అయితే తనకు ఫోన్ చేసి తనని కలవగా కేసీఆర్ గారు ఏకంగా తనని అసెంబ్లీకి తీసుకెళ్లి తనకు న్యాయం జరగాలంటూ వాదించారు.
ఇక అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు ప్రత్యూష తల్లి ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇలా కేసీఆర్ గారు కేసును సిబిఐ కి అప్పగించాలంటూ తన తరపున నిలబడ్డారని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ప్రమేయం లేకపోతే ఈ కేసు సిబిఐ కి అప్పగించి విచారణ జరిపించాలనీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తనకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. ఇలా కూతురు మరణం తర్వాత తాను డిప్రెషన్ లో ఉండగా కేసీఆర్ తనని పాప పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ ఫౌండేషన్ రన్ చేస్తూ పదిమందిలో తన కూతురిని చూసుకుని తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాటం చేయమని చెప్పారంటూ ఈ సందర్భంగా ఫౌండేషన్ వెనుక ఉన్న కారణం కూడా వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…