Ram Gopal Varma:టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఒకానొక సమయంలో తెలుగు హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం వర్మ ఆ స్థాయిలో సినిమాలు చేయలేదని విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎక్కువగా బయోపిక్ చిత్రాలపై తన ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఈయన బయోపిక్ చిత్రాలు చేయడం పెద్ద ఎత్తున వివాదాలలో నిలవడం మనం చూస్తున్నాము.ఇకపోతే ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ చిత్రాలను చేయగా తాజాగా సీఎం జగన్ రామ్ గోపాల్ వర్మకు సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాపై పెద్దగా ఎవరు ఫోకస్ పెట్టరు. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలను చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈయన సీఎం జగన్ చెప్పారని సినిమా చేస్తున్నారు అంటే కేవలం అధికార ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపించడం కోసమే సినిమా చేస్తున్నారు.ఒక వ్యక్తి గెలుపుకి మరొక వ్యక్తి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు భరద్వాజ్ వెల్లడించారు.అయితే ఇదివరకే ఈయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ అప్పటికి మాత్రమే కొంచెం బజ్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాలను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని రాంగోపాల్ వర్మకు పని కావాలి ఆయనకు డబ్బు కావాలి అందుకే ఇలాంటి సినిమాలు చేస్తుంటారు అంటూ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…