Nirmalamma: తెలుగు చిత్ర పరిశ్రమలో నటినిర్మలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సహజనటిగా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మలమ్మ చివరి వరకు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె వయసు పై పడటంతో చనిపోవడానికి కొన్ని నెలల ముందు సినిమాలకు దూరమయ్యారు.
ఇకపోతే నిర్మలమ్మ సినిమాలలో ఎంతో సహజత్వంగా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ పొందారో వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అలాంటి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఈమెకు పిల్లలు లేకపోతే సమీప బంధువుల పిల్లలను పెంచుకొని పెద్ద చేశారు అయితే ఈమె చివరి రోజులలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మలమ్మ సహజ నటిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఎంతోమంది కడుపు నింపిన ఆమె చివరి రోజులు మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని ఈయన తెలిపారు.
నిర్మలమ్మ పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోవడంలేదని ఆమె డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఆ విషయాన్ని గుర్తించక ఎంతో ఇబ్బంది పడుతూ తన చివరి రోజులు గడిపారని ఈ సందర్భంగా జర్నలిస్టు రామారావు పేర్కొన్నారు. తాను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరి రోజులలో తన పట్ల నిర్లక్ష్యం వహించారని ఈయన తెలియజేశారు. ఇలా పిల్లలు నిర్లక్ష్యానికి తోడు డయాబెటిస్ రావడంతో ఆమె కాలం చేశారని ఈయన వెల్లడించారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…