Featured

Actress Yamuna : అలా చేయడం వలన పెద్ద హీరోలతో నటించే అవకాశం కోల్పోయాను.. ఆ హీరోతో స్టూల్ వేసుకొని నటించేదాన్ని.. : యమున

Actress Yamuna : యమున దక్షిణాది సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది. ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు. యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది.ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.

1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన ‘సబితా బధేయి’ అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోద్యోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది. ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది. తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.

అయితే యమునా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ..1989 లో వచ్చిన “మౌన పోరాటం” చిత్రంలో హీరోగా నటించిన వినోద్ కుమార్ నాకంటే పొడుగ్గా ఉంటారు. ఆ చిత్రంలో కొన్ని క్లోజ్ గా ఉండే సన్నివేశాలలో నేను ఒక స్టూల్ వేసుకుని నటించే దానిని.. ఆ తర్వాత ‌1990లో విడుదలైన “అల్లుడుగారు” చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ పోషించిన గెస్ట్ రోల్ కోసం ముందుగా నన్నే సంప్రదించారు. కానీ అది గెస్ట్ రోల్ కావడం, పైగా నా డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా అవకాశాన్ని నేను వదులుకున్నాను. ఆ తరువాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ చిత్రాలలో నేను నటించలేకపోయాను. ఒకవేళ ఆ సినిమాలో నటిస్తే.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చుండేది. నా సినిమా భవిష్యత్తు కూడా మరోలా ఉండేదని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

5 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

6 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

13 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

14 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

14 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago