Actress Praveena: సాధారణంగా కొంతమంది దుర్మార్గులు డబ్బు సంపాదించడానికి అనేక చెడు మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రజలలో మంచి పాపులారిటీ ఉండటం వల్ల వారిని టార్గెట్ చేసి వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సినిమా, సీరియల్ నటీమణులు ఇలాంటి సంఘటనల ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇలా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా కొన్ని వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి కుటుంబంలో గొడవలు మొదలవటమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డబ్బు కోసం ఆశపడి ఒక నీచుడు చేసిన పనికి ప్రముఖ తమిళ సీరియల్ నటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ‘‘రాజారాణి’’ సీరియల్ ద్వారా ప్రవీణా నాయర్ తమిళంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ రావడంతో మరికొన్ని సీరియల్స్‌లో నటించే అవకాశం కూడా అందుకుంది. ఇలా బాగా పాపులర్ అయిన ప్రవీణా నాయర్ కి సంబంధించిన ఫోటోలను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే యువకుడు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం గుర్తించిన ప్రవీణ నాయర్ పోలీసులను ఆశ్రయించి ఆ యువకుడికు జైలు శిక్ష పడేలా చేసింది. కొంతకాలం జైలులో శిక్ష అనుభవించిన ఆ నీచుడు బెయిల్ మీద బయటికి వచ్చాడు.
బయటకు వచ్చిన అతడు ప్రవీనా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఫోటోలతో పాటు ఆమె కూతురు ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా ఆమె మరదలు ఫోటోలను కూడా ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం ప్రవీణా నాయర్ గుర్తించింది. దీంతో ఆమె తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతుర్ని టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…