Movie News

Dharsha Gupta: హీరోయిన్స్ గ్లామర్ వల్ల పాపులర్ కారు…. ట్రోల్ చేసినవారికి గట్టిగా సమాధానం చెప్పిన హీరోయిన్..?

Dharsha Gupta: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ గ్లామర్ ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపిస్తేనే వారికి అవకాశాలు దక్కుతాయి. ఇలా అందంగా కనిపించడం కోసం హీరోయిన్లు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. అయితే హీరోయిన్లకి అందంతోపాటు టాలెంట్ కూడా ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతాయని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నిరూపించారు.

ఎంతోమంది హీరోయిన్లు ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా డి గ్లామరైజ్ పాత్రలలో నటించడమే కాకుండా వారు ఎంత కష్టపడ్డారో కూడా మనందరికీ తెలుసు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోయిన్లు లేడీస్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సినిమాలో పాత్ర కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ షో అని ట్రోల్ చేస్తున్నవారి వాదనను తిప్పికొడుతున్నారు. తాజాగా మరొక హీరోయిన్ కూడా ఈ వాదనను తిప్పికొడుతు వారికి గట్టి సమాధానం చెప్పింది. బుల్లితెర ద్వారా పాపులర్ అయ్యి వెండి తెర మీద హీరోయిన్లుగా గుర్తింపు పొందిన వారిలో దర్శా గుప్తా కూడా ఒకరు.

‘కుక్ విత్ కోమాలి’ అనే షో ద్వారా పాపులర్ అయిన దర్శా గుప్తా వెండితెర మీద హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది. దర్శ గుప్తా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన అందమైన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమె ఇలా తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేయటం వల్ల కేవలం గ్లామర్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుందని ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఇలా తనని ట్రోల్ చేస్తున్న వారికి సమాధానంగా దర్శగుప్త ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Dharsha Gupta: హీరోయిన్ల గ్లామర్ వెనుక కష్టం ఇది…

హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ షో చేయటానికి మాత్రమే కాదని,సినిమాలో పాత్ర కోసం మేం ఎంత కష్టపడతామో చూడండి అంటూ .. ఓ మై ఘోస్ట్ లో సినిమా కోసం డూప్ లేకుండా చేసిన ఫైట్ వీడియోను తన ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. “కేవలం ఈ షాట్ కోసమే నేను ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఏమీ తినలేదు, తాగలేదు. కష్టపడనిదే ఏదీ రాదు. లవ్ యూ ఆల్” అంటూ రాసుకొచ్చింది. ఇలా ఈ వీడియో షేర్ చేసి హీరోయిన్ కేవలం గ్లామర్ షో ద్వారా పాపులర్ అవుతారని విమర్శిస్తున్న వారికి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago