Featured

Madhumitha Sivabalaji : మా పిల్లలకు మేము పెట్టిన రూల్స్ ఇవే.. ఎందుకంటే… : మధు శివబాలాజీ

Madhumitha siva balaji : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ‘ఆర్య’. బన్నీ నటించిన ఆర్య సినిమాల్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత ‘సంక్రాంతి’ సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ. తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

మా పిల్లలకు కొన్ని రూల్స్…

శివ బాలాజీ 18 ఏళ్ళ వయసులోనే నెక్స్ట్ 30 ఏళ్ళు ఎలా బ్రతకాలి, తన గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి అన్నట్లు ప్లాన్ చేసుకున్నారట. అలా చిన్న వయసులోనే వ్యాపారంలో బాగా రాణించిన శివ బాలాజీ ఇక తన కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ తెలిపారు. మధు శివ బాలాజీ లకు ఇద్దరు మగపిల్లలు ధన్వీన్, గగన్. ఇక మధు ఇంటి బాధత్యలను తీసుకుని పిల్లలను వారి చదువులను చూసుకుంటుండగా బాలాజీ సినిమాలు, వ్యాపారం లో బిజీ. అయినా కూడా వారి పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంలో ఇద్దరూ ప్లాన్ చేసుకున్నామంటూ చెబుతున్నారు. వాళ్ళు తినే ఆహారం వేస్ట్ చేయకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నామంటూ చెప్పారు.

టీవీ ముందు కూర్చొని తిన్నా, టేబుల్ మీద తిన్నా కింద ఫుడ్ చల్లితే వాళ్ళే క్లీన్ చేయాలి. ఇక వంటింటి సామాన్లు ఎక్కువ వాడారంటే వాళ్ళే క్లీన్ చేయాలి, వాళ్ళ ప్లేట్ వాళ్ళే కడగాలి ఇలాంటి నియమాలు బాలాజీ పెట్టారంట. వారికి కంఫర్ట్స్ మాత్రమే కాదు కష్టం కూడా తెలియాలి అన్నది ఆయన ఉదేశం. ఇక వారానికి ఒక రోజు మాత్రమే ప్లే స్టేషన్ ఆడాలి అన్నది మరో నిబంధన అంటూ తెలిపారు. ఇక వారి చదువు స్కూల్ లో మీటింగ్స్ అవన్నీ మధు బాధ్యత అంటూ తెలిపారు బాలాజీ. ఇక మధు చెబుతూ వాళ్ళు ఎంత డబ్బు సంపాదించాలి, ఎలా సెటిల్ అవ్వాలి అనే దానికంటే వాళ్ళు గుడ్ సిటిజన్స్ గా ఉండాలన్నది తల్లిగా నా కోరిక అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago