Featured

Director Teja : ముందుగా ఆ హీరోకి 11వేల రూపాయలు ఇస్తామన్నాం.. వారి అమ్మగారు ఒప్పుకోలేదు దాంతో ఉదయ్ కిరణ్ ను తీసుకున్నాం. ‌: డైరెక్టర్ తేజ.

Director Teja : బాలీవుడ్ సినిమాలతో కెమెరామెన్ తేజ బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో తాను ఎప్పుడో రాసుకున్న కథతో సినిమా రూపొందించి దర్శకుడిగా విజయవంతం కావాలనుకున్నారు తేజ. ఆ క్రమంలో తనను నమ్మి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చే నిర్మాత ఎవరని ఆలోచించే క్రమంలో.. ఒక రోజున రామోజీరావుకి తేజ కథ చెప్పారు. అది ఆయనకు నచ్చడంతో ముఖ్యంగా నలభై లక్షల బడ్జెట్ తో ఆ సినిమాను పూర్తి చేస్తానని రామోజీరావుకి హామీ ఇవ్వడం జరిగింది. అలా 2000 సంవత్సరంలో సినిమా మొదలు పెడదామనుకున్నారు. యూత్ హీరో, హీరోయిన్ ఆ సినిమాకి అవసరం ఉంటుంది. ఆ క్రమంలో ఎవరైతే బాగుంటుందని ఆలోచించారు.

అలాగే ఇతర హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కోసం కూడా ఆడిషన్స్ నిర్వహించారు. ఆడిషన్స్ లో కాస్త చురుకుగా కనిపించిన ఒక అబ్బాయిని తనైతే హీరోగా బాగుంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి రామారావు కి చెప్పాను. అప్పుడు లేదండి.. గత సినిమాలలో మన బ్యానర్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అబ్బాయి ఉన్నాడు. ఆయనే మనం హీరోగా పెట్టుకుందామని అన్నారు. సరే అని దర్శకుడు తేజ ఆ హీరో ఇంటికి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది స్వయంగా దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు… ముందుగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన అబ్బాయిని కాకుండా వేరే హీరోని పెడదామనడంతో నేను వారి ఇంటికి వెళ్లాను. సినిమా స్టోరీ చెప్పడంతో వారికి నచ్చింది. మేము హీరో రెమ్యూనరేషన్ కేవలం 11000 రూపాయలు ఇస్తాం. మీ అబ్బాయి చేయడానికి సిద్ధమా అని అడిగాను. మరి 11 వేల రూపాయలు ఏమిటి? మా అబ్బాయికి ఐదు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తే గాని సినిమా చేయమని హీరో మదర్ సూటిగా చెప్పారు.

అంత మొత్తం మాతో కాదని నేను తిరిగి ఆఫీసుకు వచ్చాను. జరిగిన విషయాన్ని అట్లూరి రామారావుతో చెప్పాను. లేదు నేను కూడా ప్రయత్నం చేస్తానని ఆయన ఆ హీరో దగ్గరికి వెళ్లారు. మళ్లీ అదే ఆన్సర్ హీరో అమ్మ గారి దగ్గర నుంచి రావడంతో.. ఆయన స్తబ్దుగా మళ్లీ నా దగ్గరికి వచ్చారు. హీరో అనుకొని ముందు బెంచీలో కూర్చున్న వ్యక్తిని నేను వెనుక బెంచ్ లో కూర్చోబెట్టాను. ఆ హీరో విషయం కాస్త తెలియడంతో వెనుక బెంచీలో కూర్చున్న అతన్ని(ఉదయ్ కిరణ్) ముందు సీట్లో కూర్చోబెట్టి నువ్వే ఈ సినిమాకి హీరో అని చెప్పాను. పాపం ఆయన హీరోగా చేయడానికైనా, ఫ్రెండ్ గా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు.

2000 ఫిబ్రవరి 11 అర్థ రాత్రి 12 గంటలు. తెల్లవారితే సినిమా షూటింగ్ ప్రారంభం.. బాగా ఆలోచించి చివరికి ఆ హీరోని కాదని ముందు కర్చీలో కూర్చోబెట్టిన ఉదయ్ కిరణ్ ని హీరోగా అనుకొని తెల్లవారు జామున ముహూర్త సన్నివేశం చిత్రీకరించాం. ఉదయ్ కిరణ్ షూటింగ్ లో అనుకున్న సన్నివేశాన్ని సరిగా చేయలేకపోతున్నాడు. హిందీలో దాదాపు 7 చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేస్తున్నాను. దర్శకుడిగా కొత్త ఉద్యోగంలోకి వస్తున్నాను. నువ్వు గనక ఇలా చేస్తే నా భవిష్యత్తు అంతా స్పాయిల్ అవుతుంది అని చెప్పి ఆ సీన్ గురించి తిరిగి వివరించాను. అప్పుడు ఉదయ్ కిరణ్ సరిగా నటించడం మొదలుపెట్టారు. ఈ సినిమాకి బడ్జెట్ 40 లక్షల కంటే ఎక్కువైనా పర్వాలేదు సినిమాని బాగా తీయండని షూటింగ్ మధ్యలో రామోజీరావు కబురు చేసారు. ఐనప్పటికీ లేదు నేను 40 లక్షల లోపే సినిమా తీస్తానని ప్రతి ఒక్కరికి కూడా 11వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటూ సినిమాను అతి తక్కువ బడ్జెట్లో పూర్తి చేశాం. ఆ తర్వాత ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిన విషయమే అని ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ వివరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

5 minutes ago

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…

14 minutes ago

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…

2 hours ago

బాలయ్యకు కోపం ఎందుకు వస్తుంది..? దర్శకుడు గోపాల్ క్లారిటీ

టాలీవుడ్‌లో మాస్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. ఆయన, నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన…

2 hours ago

వైభవ్‌పై దూకుడు.. జెమీసన్‌కు ఐపీఎల్ షాక్!

ఐపీఎల్‌లో మరోసారి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్చ మొదలైంది. కైల్ జెమీసన్పై ఐపీఎల్ అధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్…

3 hours ago

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. కొత్త నిబంధనలతో ప్రపంచానికి షాక్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టింది.…

3 hours ago