Actress Prema:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధర్మచక్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సీనియర్ నటి ప్రేమ. ఈమె ధర్మ చక్రం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ అనంతరం రాయలసీమ రామన్న చౌదరి, దేవి, ఓంకారం,మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాలలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రేమ కొంతకాలం సినీ పరిశ్రమకు దూరమయ్యారు.ఇక చాలా కాలం తర్వాత ఈమె అనుకోని ప్రయాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రేమ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే శివరాజ్ కుమార్ అంటే చాలా ఇష్టమని అయితే మొదటి సినిమాను తనతో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇక శివరాజ్ కుమార్ గారితో కలిసి నటించడం తనకు కలగానే ఉందని ఇలా ఆయనతో కలిసి నటిస్తున్న సమయంలో తను డైలాగ్ చెప్పడానికి కూడా ఎంతో భయపడ్డానని తెలిపారు. డైలాగ్ చెప్పడం కూడా చేతకాదా అంటూ డైరెక్టర్ తనని తిట్టారని ఈ సందర్భంగా ఈమె గుర్తు చేసుకున్నారు.
ఈ విధంగా శివరాజ్ కుమార్ తో తాను నటించిన ఓం సినిమా చూసిన అనంతరం రామానాయుడు తనకు ఫోన్ చేసి తెలుగులో ధర్మచక్రం సినిమాలో నటించే అవకాశం కల్పించారని తెలిపారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గారు అంటే తనకు గౌరవం అలాగే తెలియని భయం,మోహన్ బాబు గారిని చూడాలన్న ఆయనతో మాట్లాడాలన్న చాలా భయం వేసేదని తెలిపారు.
ఇలా తనతో మాట్లాడటానికి భయపడే తనకు రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో తనతో కలిసి నటించానని అది కూడా నెగిటివ్ పాత్రలో ఆయనతో పోటీ పడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ప్రేమ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వదిన అక్క పాత్రలలో కూడా నటించి సందడి చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…