Chiranjeevi: ఇటీవల హైదరాబాదులో జరిగిన స్కూల్ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా నిందితుడికి తప్పనిసరిగా శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. డిపిఏ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అందరిని ఎంతగానో కలచివేసింది.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం నన్ను బాగా కలిసి వేసింది. అటవీక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాల వికృతి చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షను వేగవంతం చేయాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చిన్నారి ఘటనపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఎంతోమంది తీవ్రస్థాయిలో ఖండిస్తూ నిందితుడికి శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ఈ విషయంపై స్పందిస్తూ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే తన డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
నాలుగేళ్ల చిన్నారి ఘటన అనంతరం తెలంగాణ ప్రభుత్వం అన్ని పాఠశాలలో తప్పనిసరిగా కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టడమే కాకుండా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేశారు.అయితే కొన్ని పాఠశాలలో ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు జరుగుతుండడంతో విద్యాశాఖ మరిన్ని పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…