Actress priyanka Jain: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రెటీలు సామాన్య ప్రజలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సీరియల్, సినిమా నటీనటులుగా గుర్తింపు పొందిన వారు కూడా యూట్యూబ్ ద్వారా రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు పొందటమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. ముఖ్యంగా సీరియల్ సీరియల్స్ సెలబ్రిటీలు ఈ యూట్యూబ్ ని తెగ వాడుకుంటున్నారు.
యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేసినా అడిగేవారు లేకపోవటంతో షాపింగ్, హోమ్ టూర్స్.. మేకప్ కిట్, బీరువా టూర్, ఫ్రిడ్జి టూర్, ప్రాంక్ వీడియోస్ అంటూ ప్రతీ చిన్న విషయానికి వీడియో చేసి డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. అయితే ఇలా ఏది పడితే అది వీడియోలు చేసి యూట్యూబ్లో షేర్ చేయడం వల్ల చాలా మంది సెలబ్రిటీలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వారు మాత్రం యూట్యూబ్ వీడియోలు చేయడం మాత్రం ఆపడం లేదు.
తాజాగా మరొక సీరియల్ నటి చేసిన యూట్యూబ్ వీడియో వల్ల ఆమెని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ సీరియల్ నటి మరెవరో కాదు.. జానకి కలగనలేదు సీరియల్ జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్. ఇటీవల ఆమె యూట్యూబ్ లో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ప్రియాంక జైన్ తన సీమంతం వీడియో షేర్ చేయటంతో పెళ్ళి కాకుండానే గర్భవతి అవటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే ఏది ప్రాంక్ వీడియో అని అందరికీ అర్థం అయింది. జానకి కలగనలేదు సీరియల్ డ్రీమ్ సీక్వెన్స్ లో భాగంగా ప్రియాంక ఇక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవటానికి సీమంతం అంటూ వీడియో పెట్టి.. ఆ తర్వాత ఇదంతా ఉత్తుత్తే అని ఓ బ్లాంకెట్ బయటికి తీసి అందరికీ షాకిచ్చింది. అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పే వీడియోలో.. ఇలా ప్రాంక్ చేయటంతో ఈ అమ్మడు విమర్శలు ఎదుర్కుంటోంది. పెళ్లి కాకుండానే అప్పుడే నీకు సీమంతం ఆలోచనలు వస్తున్నాయా? అంత తొందరగా ఉందా? అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…