Actress Purnaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూర్ణ రవిబాబు దర్శకత్వం వహించిన అవును సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత పూర్ణ నటించిన సినిమాలో అన్ని మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూర్ణ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తలైవి, అఖండ, దృశ్యం 2 వంటి ఎన్నోసినిమాలలో కీలకపాత్రలలో నటించింది.
ఇలా పూర్ణ వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంది. ఇక ఇటీవల దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షాహిన్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొంతకాలానికి తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తన సీమంతానికి సంబందించిన ఫోటోలతో పాటు తనకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
ప్రస్తుతం పూర్ణా 9 నెలల గర్భంతో ఉంది. మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పూర్ణ చేయకూడని పనిచేసే నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా పూర్ణ షేర్ చేసిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పూర్ణ దసరా సినిమాలోని చంకీల అంగీలేసి అనే పాటకు స్టెప్పులు వేసింది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమాలోని ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
ఈ పాటకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూర్ణ కూడా 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ ఈ పాటకు డాన్స్ చేసి వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం పూర్ణ చేసిన పనికి సీరియస్ అవుతున్నారు. గర్భవతిగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలా డాన్స్ చేయటం తల్లీ బిడ్డకు మంచిది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూర్ణ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…