Actress Rajashree:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోయిన్లు ఎప్పుడో ఒకసారి ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే. అయితే కొందరి హీరోయిన్లు అవకాశాలు రాక దూరం కాగా మరికొందరు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు సీనియర్ నటి రాజశ్రీ.
అయితే చాలా కాలం తర్వాత ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తన జీవితంలో తనకు ఎదురైన కన్నీటి కష్టాలను గురించి తెలియజేశారు.ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు వంటి హీరోల సరసన నటించిన ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆమెకు పెళ్లి చేశారు.
ఈ విధంగా హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న తనకు హైదరాబాద్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడితో పెళ్లి జరిగిందని అలా కోడలిగా తాను ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తనని అందరూ చాలా అదృష్టవంతురాలు అంటూ పొగిడారని ఈమె తెలియజేశారు.ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లడంతో తాను ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదని తెలియజేశారు.
ఇలా తన జీవితం ఆనందంగా ఉంటుంది అనుకున్న సమయంలోనే తన భర్త చనిపోయారని ఇలా తన భర్త చనిపోవడంతో ఒక్కసారిగా తన జీవితం మొత్తం తలకిందులుగా మారిందని తెలిపారు.ఈ సంఘటనతో తాను దాదాపు పది సంవత్సరాలు పాటు బయట ప్రపంచమే చూడలేదని రాజశ్రీ వెల్లడించారు.ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కన్నీటి కష్టాలను బయటపెట్టినటువంటి ఈమె ప్రస్తుతం తన పిల్లలు మనవళ్ళతో చాలా సంతోషంగా గడుపుతున్నానని తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…