Actress Saloni Aswani: ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని అగ్రతారగా గుర్తింపు పొంది వరస అవకాశాలు అందుకోవాలంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.ఇలా ఉన్నవారే ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతుంటారు. అయితే కొంతమంది ఉత్తమ నటనతో ఎంతో మంచి అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు పదికి పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి సలోని కూడా ఇదే కోవకు చెందిన వారే. సలోని ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, మగధీర, బాడీగార్డ్, రేసుగుర్రం మర్యాదరామన్న వంటి తదితర సినిమాలలో నటించారు. ఇలా అగ్ర హీరోల సినిమాలలో నటించిన కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇలా సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి సలోని ముంబైలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ఈమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉన్నటువంటి సలోనిని ఎప్పటికప్పుడు తన తల్లి ప్రోత్సహిస్తూ తనని ఇండస్ట్రీ వైపు పంపించారు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఇకపోతే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఏమాత్రం ప్రాధాన్యత లేని అవకాశాలు రావడంతో అలాంటి పాత్రలలో చేయడానికి ఇష్టం లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పటికి ఇంకా పెళ్లి చేసుకోనటువంటి సలోని తనకు ప్రాధాన్యత లేని పాత్రలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా కొంటున్నారు. తన కెరీర్ కు బ్రేక్ ఇవ్వడం పట్ల తాను ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…