Actress Sana: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 600కు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సన ఒకరు. ఇలా ఈమె సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇక తాజాగా ఈమె రంగ మార్తాండ సినిమాలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చిన్నప్పటినుంచి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టం అయితే పదో తరగతిలోనే తన పెళ్లి జరిగిందని పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తరువాత తన అత్తమామల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తనకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలియడంతో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడినట్లు తెలిపారు.
ఇక హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలని పొట్టి దుస్తులు ధరించాలని స్లిమ్ సూట్ వేసుకోవాలని కండిషన్ లు పెట్టారు. ఈ కండిషన్లకు ఒప్పుకోకపోవడంతో తనకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదని తెలిపారు. ఇక తన కుమార్తె గురించి ఈమె మాట్లాడుతూ తాను తన చేతుల మీదుగా ఎందరికో పెళ్లిళ్లు చేశాను. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ తన కూతురు జీవితం మాత్రం కఠినంగా గడిచిందని తెలిపారు.
తన కూతురికి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేయగా తన అత్తమామలు తనని దుబాయ్ తీసుకెళ్లారని తెలిపారు. అయితే అక్కడ తన కూతురిని చిత్రహింసలు పెట్టి డబ్బు బంగారం మొత్తం లాక్కున్నారని తెలిపారు. అయితే ఈ విషయాలు తన కూతురు తన వద్ద దాచి పెట్టిందని నేనే మెల్లిమెల్లిగా అన్ని తెలుసుకొని తనని ఆ నరకం నుంచి బయటకు తీసుకువచ్చి తనని కాపాడుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…