Upasana: మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగా కోడలిగా ఇంటి బాధ్యతలను ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడటమే కాకుండా, ఒక బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి ఉపాసన మరొకవైపు సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఎందరికో అండగా నిలిచారు. ఇలా సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
తాజాగా ఉపాసన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో నిలిచారు.ఇప్పటికే తన భర్త రామ్ చరణ్ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మర్చిపోకముందే మెగాకోడలు మరొక గౌరవాన్ని అందుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉపాసన చేసిన సేవలకు గాను తనకు ఈ గుర్తింపు లభించింది అంటూ ఎకనామిక్స్ టైమ్స్ తెలియజేశారు. ఇక ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా ఉపాసన ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని అలాగే కుటుంబ బాధ్యతలతో పాటు తన వృత్తిపరమైన జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ చేస్తూ మంచి గౌరవాన్ని అందుకోవడంతో అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…