Movie News

Actress Sangeetha: ఖడ్గం సినిమాలో నన్ను చూసి కృష్ణవంశీకి పిచ్చి పట్టిందా అన్నారు… నటి సంగీత కామెంట్స్ వైరల్!

Actress Sangeetha: ఎన్నో తెలుగు కన్నడ సినిమాలలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సంగీత ఒకరు. ఇలా ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా వారసుడు సినిమా ద్వారా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ తనకు నిద్ర అంటే చాలా ఇష్టమని రోజు మొత్తం నిద్రపోమన్నా తాను నిద్రపోతానని తెలిపారు. ఇక తనకు వంటలు చేయడం అన్న కూడా చాలా ఇష్టమని తన భర్త నాన్ వెజ్ తినరు కనుక ఎక్కువగా వెజిటేరియన్ వంటలు వండుతానని తెలిపారు.

ఇక పెళ్లి తర్వాత పెళ్లికి ముందు సంగీతలో మార్పులు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించగా పెళ్లి తర్వాత తన భర్త తనకు ఎలాంటి కండిషన్లు కూడా పెట్టలేదని నాకు పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిపారు ఇకపోతే ఈమె నటించిన ఖడ్గం సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో తనకు మేకప్ కాస్త ఓవర్ గా అనిపించిందని తనని తాను చూసుకొని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యానని తెలిపారు.

Actress Sangeetha: ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి అన్నారు..

ఇక ఈ సన్నివేశం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగింది అయితే తాను రానని చెప్పగా చిత్ర బృందం మాత్రం తనకు ఆ మెకప్ సెట్ అయిందని చెప్పారు.ఇలా ఆ సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో బయట అందరూ తనని చూసి కృష్ణవంశీకి ఏమైనా పిచ్చి పట్టిందా అసలు ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అందరూ మాట్లాడారు.ఆ మాటలు విని తనకు కాస్త బాధ కలిగిందని అయితే సినిమా హిట్ అయిన తర్వాత సూపర్ హిట్ కావడంతో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago