Movie News

Balakrishna: బాలయ్య కాలు తొక్కానని షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు… ఆయనకు కోపం ఎక్కువ… నటి సంచలన వ్యాఖ్యలు!

Balakrishna: నందమూరి బాలయ్యను చూస్తే ఎంతో గంభీర్యంగా కనిపిస్తారు కనుక ఈయనకు చాలా కోపం ఎక్కువ అని అందరూ భావిస్తారు. అయితే ఆయనతో పని చేస్తున్న వాళ్లు మాత్రమే బాలయ్య మంచితనం తన మనస్తత్వం గురించి చెబుతూ ఉంటారు. ఇప్పటికే బాలకృష్ణతో పని చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు బాలయ్య గురించి మాట్లాడుతూ బాలయ్య కోపిష్టి అని చాలామంది అంటారు కానీ ఆయన మనసు చాలా మంచిదని ఇప్పటికే బాలయ్య పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా నటి లయ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలయ్యతో విజయేంద్ర వర్మ సినిమాలో కలిసి నటించే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య బాబుతో కలిసి ఓ పాటలో నటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో నా వెనుక బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనని నేను చూసుకోలేదు పొరపాటున తన కాలు తొక్కానని తెలిపారు.

ఇలా తన కాలు తొక్కగానే వెంటనే వెనక్కి తిరిగి చూసి అయ్యో సారీ సార్ చూసుకోలేదు అంటూ తనకు క్షమాపణలు చెప్పాను. కానీ బాలయ్యకు కోపం ఎక్కువ అని నేను విన్నాను .ఆ టెన్షన్ నన్ను మరింత భయానికి గురి చేసింది. ఇలా కాలు తొక్కగానే బాలకృష్ణ గారు వెంటనే ప్యాకప్ అని చెప్పేశారు. దాంతో నాకు మరింత భయం పెరిగింది. నావల్ల షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది అంటూ చాలా బాధపడ్డాను.

Balakrishna: బాలయ్యది మంచి మనసు…

ఆ సమయంలో బాలకృష్ణ నా వద్దకు వచ్చి నేను కంగారు పడుతూ ఉండగా సరదాగా అన్నాను మరేం భయపడాల్సిన పనిలేదు అంటూ మాట్లాడారు అయినప్పటికీ నాలో భయం తగ్గలేదు.అయితే నన్ను తిరిగి మామూలు స్థాయికి తీసుకురావడం కోసం ఆయన సరదాగా మాట్లాడుతూ జోకులు కూడా వేశారని లయ తెలిపారు. అందరిలాగే బాలయ్యకు కోపం ఎక్కువ అని నేను కూడా అనుకున్నాను కానీ ఆయనది అది కోపం కాదు అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ మంచితనం తన వ్యక్తిత్వం గురించి లయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago