ప్రస్తుతం ఎక్కడ.. ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో ఇలా తెలిసిపోతుంది. సోషల్ మీడియా ద్వారా వార్తలు అత్యంత వేగంగా తెలిసిపోతున్నాయి. అయితే సోషల్ మీడియాల వచ్చే ప్రతీది నామ్మాలా.. వద్దా.. అనేది రీడర్ పై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని వార్తలను కొంతమంది కావాలనే స్పష్టిస్తారా లేకా మరేదైనా కారణం ఉందా అనేది తెలియదు కానీ ఫేక్ వార్తలు భలే వైరల్ అయిపోతాయి. చావు బతుకుల మధ్య ఉన్న వాడ్ని చనిపోయాడని.. ఆక్సిడెంట్ అయింది ఒక వ్యక్తికి అయితే మరో వ్యక్తికి ప్రమాదం జరిగిందని ఇలా ఫేక్ వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి.
ఇలాంటివి మనం చాలా వరకు చూసి ఉంటాం. గతంలో నటుడు వేణు మాధవ్ బతికుండగానే చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా వేణు.. తాను బతికే ఉన్నానని చెప్పిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇలాంటిదే రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒకప్పటి శృంగార తార షకీలా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. షకీలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తాను ఇక లేరు అంటూ కొన్ని ఫేక్ వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో ఈ వార్తలకు ఎంతకీ చెక్ పడకపోవడంతో షకీలా ట్విట్టర్ వేదికగా అధికారికంగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను ఖండిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో ఆమె మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. నా ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చనిపోయానంటూ పుకార్లు వచ్చాయి. కానీ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ వార్తలను చూసి నా బంధువులు, శ్రీయోభిలాషులు చాలా మంది ఫోన్ చేశారాని.. తన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు ఫోన్ చేసినవారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా ఫేక్ వార్తను సృష్టించిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఆ వార్త ఇంతలా పాపులారిటీ సంపాదించడం వల్లనే కదా మీరంతా నా గురించి ఆలోచించి.. ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారంటూ ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…