Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల్లో సినిమాలలు చేసిన సన బేగం, అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండింటినీ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉంటున్నారు. నిన్నేపెళ్లాడతా సినిమాతో తెలుగులో తన సినిమా ప్రయాణం మొదలు పెట్టిన సన గారు ఆపైన ఎన్నో సినిమాల్లో తల్లి, అక్క, వదిన, అత్త అంటూ రకరకాల పాత్రలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు భాషల్లో నటిస్తూ ఉన్న సన గారు తాజాగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిమానులకు మరింత చేరువయ్యారు. తాజాగా తాను నటించిన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ గురించి సన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
అలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ మరిన్ని చేస్తాను…
మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ లో సన ఒక మధ్య తరగతి గృహిణిగా నటిస్తూ అందులో ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునే క్యారెక్టర్ లో నటించారు. అందులో ఒక తాగుబోతు భర్త ఉండి కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళగా నటించిన సన, ఆ సినిమాలో నటుడు అలీ రెజాతో బోల్డ్ సీన్స్ లో నటించింది. ఇక ఆ సిరీస్ గురించి మాట్లాడుతూ ఆ పాత్ర ఒక మంచి మెసేజ్ ఇస్తుంది సమాజానికి, ఎంతో మంది మహిళలు అలా భర్త బాధ్యత లేకుండా తిరుగుతుంటే కష్టపడుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు.
అలాంటి ఒక పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ క్యారెక్టర్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది అనిపించింది అందుకే చేశాను. ఇకపై అలాంటి పాత్రలు వచ్చినా నటిస్తాను అంటూ చెప్పారు. అందులోనూ పెద్ధ ప్రొడక్షన్ హౌస్, మంచి డైరెక్టర్ అయినపుడు ఖచ్చితంగా చేస్తాను అంటూ చెప్పారు సన.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…