Comedian Srilakshmi : బాబు చిట్టీ అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీ లక్ష్మి. ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగు ప్రొడ్యూసర్ అమర్నాథ్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లక్ష్మి తండ్రికి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టింది. శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ కూడా హీరోగా, సినిమాల్లో నటించారు. ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా తమిళ, తెలుగు లో నటిస్తోంది.
చంద్ర మోహన్ తో జాగ్రతగా ఉండాలి…
శ్రీలక్ష్మి గారు ఆర్థిక ఇబ్బందులతో సినిమాల్లోకి అడుగుపెట్టినా చాలా సినిమాల్లో కామిక్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జంధ్యాల, కే విశ్వనాధ్ గారి సినిమాల్లో మంచి పాత్రలతో నంది అవార్డులు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి మొదట్లో సినిమాల్లో నటించే సమయంలో తాను పడిన ఇబ్బందులను తెలిపారు. కంగారు ఎక్కువ ఉండటం వల్ల జంధ్యాల గారి షూటింగులో ఆయనతో తిట్టించుకున్నానని కానీ అలా తిట్టించుకోవడం వల్లే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయ్యానంటూ చెప్పారు.
ఇక షూటింగ్స్ లో కంగారు పడటం వల్ల డైలాగు చెప్పే సమయంలో తడబడేదాన్ని అంటూ చెప్పిన శ్రీలక్ష్మి గారు విశ్వనాధ్ గారి సినిమాలో అయితే అమ్మాయిని కంగారు పెట్టకండి అని పక్కన వాళ్లకు చెప్పేవారు. సెట్స్ లో చంద్రమోహన్ ఉన్నాడంటే ఇక అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనుక నుండి వచ్చి టక్కున చంప మీద కొట్టి వెళ్తాడు. ఫిర్యాదు చేయడానికి కూడా ఉండదు బాగా తప్పించుకుంటాడు, బాగా డేంజర్. అందుకే జాగ్రత్తగా ఉండాలి తనతో ఉన్నపుడు అంటూ అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…