Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె నిన్నేపెళ్లాడతా సినిమాలో బెనర్జీ వైఫ్ గా క్యారెక్టర్ చేసి తెలుగు లో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక చక్రవాకం సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన లైఫ్, కెరీర్ అన్ని విశే్షాలను పంచుకున్నారు.
ఆస్ట్రేలియాలో బాగా టార్చర్ చేసారు…
సన బేగం ఇంటర్ చదివే సమయంలోనే పెళ్లి చేసేసుకున్నారు. తండ్రికి వ్యాపారంలో లాస్ రావడంతో సన కు త్వరగా పెళ్లిచేసేశారట. ఇక అత్తింటి వారి ప్రోత్సాహంతోనే బిఎడ్ వరకు చదివిన సన తోలుత స్కూల్ పెట్టాలని అనుకున్న చివరకు మోడలింగ్ వైపు అడుగులేసారు. ఇంట్లో అత్త మామల సపోర్ట్ తోనే యాడ్స్ చేస్తూ ఉన్న సనకు నిన్నేపెళ్ళాడుతా సినిమా అవకాశం రావడంతో ఒక్కసారిగా లైఫ్ మారిపోయింది అంటూ చెబుతారు. ఇక ఇద్దరు పిల్లలు పుట్టక సినిమాల్లోకి వచ్చిన సన తన పిల్లలని మాత్రం సినిమా ఫీల్డ్ లోకి తీసుకు రాలేదు. అమ్మాయికి కి పెద్దగా ఇష్టం లేకపోవడం వల్ల మొదట్లో మంచి అవకాశలు వచ్చిన సినిమాలోకి వద్ధన్నుకున్నారట.
ఇక కూతురు చదువయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపగా వాళ్ళు బాగా మోసం చేసారని తెలంగాణ పోలీసులు ఈ విషయంలో బాగా సహాయం చేసారంటూ తెలిపారు. దుబాయ్ లో ఇల్లు ఉంది అని చెప్పి అక్కడ బాగా చిత్ర హింసలు పెట్టారు. అక్కడ ఒకచోట అని చెప్పి ఆస్ట్రేలియా తీసుకెళ్ళి అక్కడ బాగా టార్చర్ చేసారు. ఇవన్నీ కూతురు చెప్పకపోయినా ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళినపుడు నాకు అర్థమైంది .ఇక విషయాలు తెలిసాక తనని తీసుకోచ్చి పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేయించాం అంటూ చెప్పారు. కొడుకు, నా భర్త, నేను నా కూతురుకి అండగా నిలబడ్డాం . తాను ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోస్ చేస్తోంది. తనకు ఐదేళ్ళ చిన్నారి కూడా ఉంది అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…