Venkatesh: చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల అవార్డులను ప్రకటిస్తూ సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తెలుగు సినీ సెలబ్రిటీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే నంది అవార్డులు చాలా ప్రత్యేకమైనవని చెప్పాలి. ఇలా ప్రభుత్వం కళాకారులను గౌరవిస్తూ వారికి అందించే పురస్కారమే ఈ నంది అవార్డులు.
ఒకానొక సమయంలో ప్రతి ఏడాదికళాకారులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది అయితే గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డుల గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో పలువురు నిర్మాతలు హీరోలు ఈ నంది అవార్డుల గురించి ఇదివరకే మాట్లాడిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి పునరాలోచన చేసే అవార్డులతో కళాకారులను సత్కరిస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ సైతం నంది అవార్డుల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ….
నేను నంది అవార్డుల గురించి ఏమాత్రం ఆలోచించను ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం… లేదంటే లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు మాలో చాలా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…