Featured

Actress Shanoor Sana Begum : హీరోయిన్ అవ్వాలంటే ఎక్సపోసింగ్ చేయాలన్నారు…పెళ్లి, పిల్లల గురించి అపద్దాలు చెప్పాలని అన్నారు… బుర్కా వేసుకోలేదని అవమానించారు…: నటి షానూర్ సన బేగం

Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో బెనర్జీ వైఫ్ గా క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.

హీరోయిన్ అవకాశాలు అందుకే వద్దనుకున్నా…

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన సన గారు మొదటి ప్రయత్నంలోనే మంచి అవకాశాలాను అందుకున్నారు. అయితే హీరోయిన్ గా ప్రయత్నించలేదా అంటే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా ఎక్సపోసింగ్ విషయంలో వద్దానుకున్నాను. ఇక మరికొన్ని సినిమాలు కథ నచ్చక వద్దనుకున్నా అంటూ తెలిపారు. మోడలింగ్ లోనూ సినిమాల్లోనూ నటించే సమయానికే పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉండగా చాలా మంది సినిమాల్లోనూ యాడ్ షూటింగ్స్ అపుడు పెళ్లి అయిందని పిల్లలు ఉన్నారని చెప్పకండి అనేవారు. అలా చెబితే అవకాశాలు పోతాయని చెప్పేవారు. కానీ నేనెందుకు దాచాలి అనుకునేదాన్ని అంటూ చెప్పారు.

ఇక ఇంట్లో అత్తమామలు నేను మోడలింగ్ చేస్తానని చెప్పినపుడు ఒప్పుకున్నారు. తాను అన్ని సార్లు అడుగుతోంది అదేంటో చూడు అని మామగారు చెప్పేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు మీ కోడలు బుర్కా వేసుకోదు మోడలింగ్ చేస్తోంది అంటూ అవమానించేలా మాట్లాడినా మామ గారు తాను గౌరవప్రదంగా పనిచేసినంత వరకు మాకు అభ్యంతరం లేదు, మీ ఇంట్లో ఎవరికన్నా పని కావాలంటే నా కొడలికి చెబుతాం చూస్తుంది అని అనేవారట. అలా అత్తింటి వారి సపోర్ట్ వల్లే కెరీర్ లో ముందుకు వెళ్ళగలిగాను, షూటింగ్స్ అపుడు అత్తగారు వెంట వచ్చేవారు అంటూ చెప్పారు సన.

Bhargavi

Recent Posts

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

1 minute ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

7 minutes ago

లైవ్ షోలో లిప్ సింక్.. అడ్డంగా దొరికిపోయిన సింగర్

సినిమా పాటలు ఎంత హిట్ అవుతాయో, వాటిని పాడే సింగర్స్‌కూ అంతే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్,…

13 minutes ago

222 బంతుల్లో 500 రన్స్.. యువ బ్యాటర్ సంచలనం

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్…

16 minutes ago

ఎన్టీఆర్ మాట వినని హీరోయిన్.. సినిమా నుంచే తప్పుకున్న సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…

30 minutes ago

పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…

30 minutes ago