Actress Sneha:టాలీవుడ్ ఇండస్ట్రీకి తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి స్నేహ. ఈమె ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఎంతో అద్భుతమైన ప్రేమ కథలను, కుటుంబ కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకుంది.స్నేహ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సౌందర్య లేని లోటును భర్తీ చేసిందని చెప్పాలి.
ఇకపోతే స్నేహ సౌందర్య అంత గుర్తింపు సంపాదించుకోకపోయినా తన కట్టుబొట్టుతో సౌందర్యను గుర్తు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్నేహ ఫెడ్ అవుట్ అయ్యారు. ఇక స్నేహ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తమిళ నటుడిని వివాహం చేసుకున్న తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించడమే కాకుండా పలు బుల్లితెర యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా పలు యాడ్స్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన స్నేహ ఓసారి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొందని అప్పట్లో వార్తలు వచ్చాయి. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అంటేనే అక్కడికి ఎంతో మంది అభిమానులు చేరుకుంటారు. అయితే ఆ క్షణంలో ఎంతోమంది హీరోయిన్స్ ను తాకరాని చోట తాకుతూ ఉంటారు అయితే కొందరు వాటిని మౌనంగా భరించగా మరికొందరు మాత్రం అలాంటి చేష్టలపై రియాక్ట్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే నటి స్నేహ సైతం ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నేహ నడుమును గిల్లడంతో ఒక్కసారిగా స్నేహ గట్టిగా అరిచారట. అయితే అక్కడ సిబ్బందికి స్నేహ అసలు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారని అయితే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారని తెలుస్తుంది అయితే ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…