Sai Kiran : అలనాటి సింగర్ సుశీలమ్మ మనవడు, సింగర్ రామకృష్ణ గారి కొడుకు సాయి కిరణ్. కానీ ఏమాత్రం తండ్రి రెఫరెన్స్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన సాయి కిరణ్ మొదటి సినిమా ‘నువ్వే కావాలి’ సినిమాలో నటించి మంచి గుర్తింవు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత నటించిన ‘ప్రేమించు’ సినిమాతో నటుడుగా మరో మెట్టు ఎక్కాడు సాయి కిరణ్. అయితే మంచి సినిమాలు పడకపోవడం వల్ల అందం, అభినయం రెండూ ఉన్నా సాయి కిరణ్ హీరోగా మంచి స్థానాన్ని నిలుపుకోలేక పోయాడు. అలా అని నిరుత్సాహ పడకుండా బుల్లితెరపై నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే సీరియల్స్ లో నటించడం వల్ల మలయాళం, తమిళం ఇలా అన్ని భాషల వాళ్లకు చేరువయ్యానని నాకు చాలా మంది అభిమానులు ఉన్నారంటూ సాయి కిరణ్ చెప్పారు.
వారితో నటించాలనేది కోరిక… బింబిసార పార్ట్ 2 లో ఎన్టీఆర్ తో నటిస్తున్నా…
ఇక అడపాదడపా సినిమాలను కూడా చేస్తున్న సాయి కిరణ్ తనకు నచ్చిన ఈ తరం హీరోల గురించి మాట్లాడుతూ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వారి సినిమాలు ఖచ్చితంగా చూస్తానని చెప్పారు. ఇక వారితో కలిసి నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా సినిమాలో చేస్తానని చెప్పారు. మహేష్ పర్సనాలిటీ కి నేను సరిపోతాను కాబట్టి ఆయనతో నటించడం బాగుంటుందని అనిపిస్తుంది.
ఇక బన్నీ స్టైలిష్ గా తనని తాను చెక్కుకుని పైకి వచ్చాడు అతనితో నటించాలని కోరిక. ఇక మూడో కోరిక ఎన్టీఆర్ తో నటించాలని అది నెరవేరబోతోంది అంటూ, బింబిసార పార్ట్ 2 లో నటిస్తున్నాను అంటూ లీక్ చేశారు. ఎన్టీఆర్ నటన చాలా ఇష్టమని కళ్ళతోనే హవభావాలను చూపిస్తారు అలాంటి నటుడితో నటిస్తే మనకు చెప్పుకోడానికి బాగుంటుంది అంటూ చెప్పారు సాయి కిరణ్. మొత్తానికి బింబిసార పార్ట్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడ్సనే విషయం మాత్రం లీక్ అయిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…