Movie News

స్టార్ హీరోయిన్‌కు వరుస ప్లాపులు.. అయినా రెమ్యునరేషన్ తగ్గించేదే లేదంటోన్న శ్రీలీల!

హైదరాబాద్: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, వరుస అవకాశాలతో దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చింది. దీంతో అగ్ర హీరోలు సైతం ఈ బ్యూటీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు.

actress sreeleela remuneration doubled even after flops

కానీ, గత కొంతకాలంగా శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. వరుస ప్లాపులతో సతమతమవుతోంది. అలాగే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, వరుస ప్లాపులు వస్తున్నప్పటికీ ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గట్లేదని టాక్ వినిపిస్తోంది.

“ధమాకా” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీలీల, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినా హిట్టు అందుకోలేకపోయింది. సినిమాలతో పాటు స్పెషల్ పాటలతోనూ రచ్చ చేస్తోంది. ఇటీవల అఖిల్ సరసన నటించాల్సిన “లెనిన్” మూవీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, “వైరల్ వయ్యారి” అంటూ ఓ ప్రత్యేక పాటతో నెట్టింట సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న “జూనియర్” సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, జెనీలియా కీలకపాత్రలో నటిస్తున్నారు.

భారీగా పెరిగిన పారితోషికం?

వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికీ, శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు తన పారితోషికం డబుల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఒక సినిమాకు రూ. 2 కోట్లు పారితోషికం తీసుకున్న శ్రీలీల, ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

telugudesk

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago