Actress Sridevi: దివంగత నటి శ్రీదేవి ఈమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన శ్రీదేవి గత నాలుగు సంవత్సరాల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈమె మరణించి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈమె మరణం వార్తను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం చేసుకున్నటువంటి శ్రీదేవి 1997లో ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు.ఇలా కుటుంబ బాధ్యతలను చెక్కబడుతున్నటువంటి ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన చివరికి 2016 వ సంవత్సరంలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
గౌరీ షిండే దర్శకురాలిగా వ్యవహరించినటువంటి ఈ సినిమాలో శ్రీదేవి ఒక సాధారణ గృహిణిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఆమె పడే తాపత్రయం గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. ఇకపోతే ఈ సినిమా విడుదలయి అక్టోబర్ 10వ తేదీకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే దర్శకురాలు గౌరీ షిండే ఈ చిత్రంలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇలా శ్రీదేవి ఈ సినిమా కోసం ఉపయోగించిన చీరలను వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బులను బాలికల చదువుల కోసం కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలకు విరాళంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ గౌరీ షిండే తెలియజేస్తూ ఇదే శ్రీదేవి గారికి ఇచ్చే ఘన నివాళి అంటూ తెలియజేశారు. ఇక ఈ విషయం తెలియడంతో శ్రీదేవి అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…