Actress Taapsee: ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ.ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె పూర్తిగా తెలుగు తెరకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేశారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా తాప్సి నటించిన దొబెరా సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె అప్సెట్ అయినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె మీడియాపై సీరియస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాప్సీ మరోసారి మీడియాపై మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి ఈమెను ప్రశ్నిస్తూ..దొబారా’ చిత్రం విడుదలకు ముందు జరిగిన ‘నెగెటివ్ క్యాంపెయిన్ గురించి ప్రశ్నించగా ఈమె ఒక్కసారిగా మండిపడింది. ఈ సినిమా కంటే ముందుగా ఏ సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్ జరగలేదు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇలా మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితేనే నేను కూడా మీ ప్రశ్నకు సమాధానం చెబుతా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఈ క్రమంలోనే రిపోర్టర్ దొబారా చిత్రంతోనే నెగెటివ్ క్యాంపెయిన్ ప్రారంభ అంటూ రిపోర్టర్ సమాధానం చెప్పగా ఈ మాటకు తాప్సీ మాట్లాడుతూ ఏ విషయం గురించైనా ప్రశ్నించే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి అంటూ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…