Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఈ ఫ్యామిలీ నుంచి మనోజ్ విష్ణు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన శైలిలో ఇండస్ట్రీలో గుర్తింపు పొందడం కోసం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ సినిమాలలో తక్కువగా నటించినప్పటికీ ఈయన సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
మంచు ఫ్యామిలీలో వివాదాలకు దూరంగా మనోజ్ ఉంటారు. ఇకపోతే ఈయన సినిమాలు వచ్చి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది. ఈ క్రమంలోనే ఈయన సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మనోజ్ కర్నూలు రాజకీయ కుటుంబానికి చెందిన దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికను రెండవ వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో పూర్తిగా నిజం ఉందని త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా తెలియజేయనున్నారని తెలుస్తోంది.ఇలా మనోజ్ రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు మొదటి భార్య ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే మనోజ్ తన మొదటి వివాహాన్ని ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమెను మనోజ్ ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహమైన కొన్ని రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకుల తీసుకున్న ప్రణతి ప్రస్తుతం అమెరికాలో సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. ఇక ఈమె అమెరికాలో ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…