Anchor Vishnu Priya: పోవే పోరా కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లితెర యాంకర్ గా పరిచయమయ్యారు విష్ణు ప్రియ.ఇలా ఈ కార్యక్రమంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే గత కొంతకాలం నుంచి బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక తనకు బిగ్ బాస్ కార్యక్రమం ఏమాత్రం నచ్చదని అందుకే తాను ఈ కార్యక్రమాన్ని ఫాలో కూడా కానని ఈమె తెలియజేశారు.
ఒకవేళ తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చిన ఈ కార్యక్రమానికి అస్సలు వెళ్ళనని భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన ఈ కార్యక్రమానికి మాత్రం వెళ్ళనంటూ ఖరాఖండిగా చెప్పేశారు.అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళరో రీజన్ తెలియనిప్పటికీ తాను మాత్రం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లనని చెప్పారు. అయితే హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో ఆఫర్ వస్తే మాత్రం వెళ్తానంటూ ఫన్నీ సమాధానం చెప్పారు.
హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తే ఎన్నో ఆఫర్స్ వస్తాయంటూ ఈమె సరదాగా సమాధానం చెప్పారు.బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఫాలో కానటువంటి విష్ణు ప్రియ ప్రస్తుతం సీజన్ సిక్స్ ప్రసారమవుతుండగా తాను నేహా శర్మకు మద్దతు తెలుపుతున్నానంటూ వెల్లడించారు. తనకు బయట నుంచి ఉండాల్సిన పూర్తి సపోర్ట్ నా నుంచి ఉంటుందని తాను చాలా జెన్యూన్ పర్సన్ అంటూ ఈ సందర్భంగా విష్ణు ప్రియ నేహా శర్మకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…