Actress Tabu: సినిమా సెలబ్రిటీల జీవితం ఎంతో లగ్జరీగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే ఆ లగ్జరీ జీవితం వెనుక ఎంతో కష్టం ఉంటుందని కొన్నిసార్లు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సమయంలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రమాదాలలో మృతి చెందిన నటీనటులు కూడా ఉన్నారు.
ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల తీవ్ర గాయాలు పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలా షూటింగ్లలో ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి టబు ఇలాంటి ప్రమాదానికి గురయ్యారు. ఈమె అజయ్ దేవగన్ నటిస్తున్న భోళా సినిమా షూటింగ్లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు హైదరాబాదులో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక గ్లాస్ పగిలిపోవడం వల్ల ఆ గాజు ముక్కలు టబు కంటికి నుదుటి పై భాగంలో తగిలాయని దాంతో ఈమె కంటికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈమె గాయాలు పాలు కావడంతో వెంటనే చిత్ర బృందం తనని మెరుగైన చికిత్స కోసం ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.
ఇలా షూటింగ్ లో గాయాలు పాలైన ఈమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక టబు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించారు. కూలి నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన టబు తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…