Featured

Daggubati Rana : విడాకులు తీసుకుంటారు అంటూ రూమర్స్.. దిమ్మతిరిగేలా జవాబు చెప్పిన హీరో భార్య…!

Daggubati Rana : సెలబ్రిటీల విషయంలో ఏం జరిగినా అది బయట పబ్లిక్ కు ఇంట్రెస్టింగ్ అంశమే. ఇక ఏ చిన్న విషయాన్నైనా తెలుసుకోవాలని అనుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి కలిపి వార్తలను వండేస్తుంటారు. రోజు చూసే సెలబ్రిటీ పుకార్లలో పది శాతం కూడా నిజాలు ఉండవు. కొన్నిసార్లు వీళ్ళు రాసే పిచ్చి వార్తల వల్ల కుటుంబాల్లో కలతలతో బాధపడిన సెలబ్రిటీ కుటుంబాలు ఎన్నో. ఇక ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడం, సినిమాల గురించి తమ అభిమాన నటుల గురించి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ తెలుసుకుంటూ ఉన్నారు. ఇక అలా చూస్తున్నారు కాదా అని నిజంగా జరిగిన వార్త కాకుండా ఊహగానాలను ప్రచారం చేస్తూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు చాలా మంది సామాజిక మధ్యమాల్లో.

మేము విడాకులు తీసుకోలేదని చెప్పాకనే చెప్పిన మిహిక…

ఒక హీరో లేదా సినిమా రంగానికి చెందిన ఎవరైన సరే భార్య భర్తలు కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న లేక వాళ్లిద్దరు కలిసి బయట కనిపించకపోయినా ఇంక అంతే పలానా జంట వీడిపోతున్నారని కారణాలు ఇంకా తెలియాలంటూ ఏవేవో వార్తలు రాస్తుంటారు. చివరికి ఆ జంట సోషల్ మీడియా ద్వారా మేము కలిసే ఉన్నాము విడిపోలేదు అని చెప్పాల్సిన పరిస్థితి. ఇటీవలే సింగర్ హేమచంద్ర, శ్రావణి భార్గవి విషయంలో ఇలాగే జరిగింది. మళ్ళీ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఈ పుకారలపై. ఇక ఇపుడు అలాంటి పూకార్లే ఎదుర్కొన్నారు దగ్గుబాటి హీరో రానా ఆయన భార్య మీహిక బజాజ్. రానా కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియా నుండి వెళ్లిపోతున్నట్లు మెసేజ్ పెట్టి గత ఫోటోలను కూడా డిలీట్ చేసేసాడు. ఇక అంతే రానా, అతని భార్య విడాకులు తీసుకోబోతున్నారు అది ఇది అంటూ వార్తలు రాసేసారు.

ఇక వీటికి చెక్ పెడుతూ రానా భార్య మిహిక బజాజ్ సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విడాకులు తీసుకోలేదని చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. ఆగష్టు 8 న రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ ల వివాహం జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో వాళ్ల పెళ్లి రోజును పురస్కరించుకుని పెళ్లి ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయనివి అలాగే భర్తతో ఆనందంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక ఈ ఫోటోలకు వెంకీ కూతురు ఆశ్రీత తో మొదలుకుని అందరూ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త్వరలోనే శుభవార్త చెప్పాలంటూ ఆటపట్టించారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

5 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

1 day ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

1 day ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

1 day ago