Categories: FeaturedMovie News

“నేను డబ్బు కోసం ఐటం సాంగ్స్ చెయ్యట్లేదు” అంటున్న మిల్కీ బ్యూటీ !!

ఐటమ్ సాంగ్.. ప్రస్తుత జనరేషన్ లో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న అంశాలలో ఇది కూడా ముందుంది. ఫలానా ప్రముఖ హీరోయిన్ ఈ ఐటమ్ సాంగ్ చేసిందంటే చాలు.. థియేటర్లు నిండిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమా ఐటమ్ పాటల్లో ముమైత్ ఖాన్ ఎంతో జోరు కనబరిచింది. తమన్నా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ నుంచి ఇటీవలి పాయల్ రాజ్‌పుత్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్‌ల్లో నటిస్తున్నారు. సన్నీలియోన్ కూడా అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపిస్తోంది. వీరు హీరోయిన్‍‌లతో పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నవతరం సినిమాల్లో ఐటెం సాంగ్ అనేది చాలా ముఖ్యమైపోయింది. కొన్ని సినిమాలకు ఐటెం సాంగే ప్రధాన బలం అవుతుండటం గమనిస్తూనే వున్నాం. దీంతో ప్రతీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు.

ఈ క్రమంలోనే సినిమాకు ప్లస్ అయ్యేలా ఆ ఐటెం సాంగ్స్ కోసం ఫేమస్ అందాల తారలు, స్టార్ హీరోయిన్స్‌ని తీసుకొని కిక్కిస్తున్నారు. పైగా ఆ ఐటెం సాంగ్స్ చేసినందుకు గాను మంచి రెమ్మ్యూనరేషన్ ఇస్తుండటంతో అగ్ర హీరోయిన్స్ సైతం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ ఉర్రూతలూగిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నాపై సోషల్ మీడియాలో ఓ గాసిప్ చక్కెర్లు కొడుతోంది. టాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన ఈ అందాల తార ఈమధ్యనే విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నైట్ పార్టీ సాంగ్‌తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించింది. అయితే ఇదంతా కేవలం డబ్బు కోసమే తమన్నా ఇలా ఐటెం సాంగ్స్ చేస్తోందని, ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇలా ఐటెం సాంగ్స్ చేయడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు తాజాగా తమన్నా దగ్గర ప్రస్తావించగా.. తాను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, కేవలం డబ్బు కోసమే ఐటెం సాంగ్స్ చేస్తున్నానని అనుకోవడం చాలా పొరపాటని తెలిపింది. తనకు డ్యాన్స్ అన్నా, స్పెషల్ సాంగ్స్ అన్నా చాలా ఇష్టమని.. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం వాటి వల్లే కలుగుతుంది కాబట్టి చేస్తున్నానని.. అంతే తప్ప మీరనుకుంటున్నట్టుగా కేవలం డబ్బు కోసం మాత్రం కాదని, అయినా సోషల్ మీడియాలో తారలపై ఇలాంటి గాసిప్స్ కామన్ అని.. అలాంటి రూమర్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పింది తమన్నా. చదివారుగా తమన్నా ధీటైన సమాధానం.. మరి ఇప్పుడేమంటారు.?

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

5 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

5 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

5 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

5 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

5 months ago