ఐటమ్ సాంగ్.. ప్రస్తుత జనరేషన్ లో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న అంశాలలో ఇది కూడా ముందుంది. ఫలానా ప్రముఖ హీరోయిన్ ఈ ఐటమ్ సాంగ్ చేసిందంటే చాలు.. థియేటర్లు నిండిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమా ఐటమ్ పాటల్లో ముమైత్ ఖాన్ ఎంతో జోరు కనబరిచింది. తమన్నా, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ నుంచి ఇటీవలి పాయల్ రాజ్‌పుత్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్‌ల్లో నటిస్తున్నారు. సన్నీలియోన్ కూడా అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపిస్తోంది. వీరు హీరోయిన్‍లతో పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నవతరం సినిమాల్లో ఐటెం సాంగ్ అనేది చాలా ముఖ్యమైపోయింది. కొన్ని సినిమాలకు ఐటెం సాంగే ప్రధాన బలం అవుతుండటం గమనిస్తూనే వున్నాం. దీంతో ప్రతీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు.

ఈ క్రమంలోనే సినిమాకు ప్లస్ అయ్యేలా ఆ ఐటెం సాంగ్స్ కోసం ఫేమస్ అందాల తారలు, స్టార్ హీరోయిన్స్‌ని తీసుకొని కిక్కిస్తున్నారు. పైగా ఆ ఐటెం సాంగ్స్ చేసినందుకు గాను మంచి రెమ్మ్యూనరేషన్ ఇస్తుండటంతో అగ్ర హీరోయిన్స్ సైతం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ ఉర్రూతలూగిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నాపై సోషల్ మీడియాలో ఓ గాసిప్ చక్కెర్లు కొడుతోంది. టాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన ఈ అందాల తార ఈమధ్యనే విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నైట్ పార్టీ సాంగ్‌తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించింది. అయితే ఇదంతా కేవలం డబ్బు కోసమే తమన్నా ఇలా ఐటెం సాంగ్స్ చేస్తోందని, ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇలా ఐటెం సాంగ్స్ చేయడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు తాజాగా తమన్నా దగ్గర ప్రస్తావించగా.. తాను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, కేవలం డబ్బు కోసమే ఐటెం సాంగ్స్ చేస్తున్నానని అనుకోవడం చాలా పొరపాటని తెలిపింది. తనకు డ్యాన్స్ అన్నా, స్పెషల్ సాంగ్స్ అన్నా చాలా ఇష్టమని.. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం వాటి వల్లే కలుగుతుంది కాబట్టి చేస్తున్నానని.. అంతే తప్ప మీరనుకుంటున్నట్టుగా కేవలం డబ్బు కోసం మాత్రం కాదని, అయినా సోషల్ మీడియాలో తారలపై ఇలాంటి గాసిప్స్ కామన్ అని.. అలాంటి రూమర్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పింది తమన్నా. చదివారుగా తమన్నా ధీటైన సమాధానం.. మరి ఇప్పుడేమంటారు.?



























